హుజుర్‌నగర్‌పై వరాల జల్లు కురిపించిన కేసీఆర్
- October 26, 2019
తెలంగాణ:ఇటీవల జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్‌నగర్ ఇప్పుడు టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు గురువారం వెల్లడించిన సీఎం కేసీఆర్.. దీనికి ప్రజా కృతజ్ఞత సభగా పేరు పెట్టారు. అయితే ఈ ఫలితాలపై ఆర్టీసీ సమ్మె ప్రభావం పడుతుందని అందరూ భావించారు. కానీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్‌కే పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో ఈ సభలో పాల్గొననున్న కేసీఆర్.. హుజూర్ నగర్ ప్రజలకు భారీ వరాలు ప్రకటిస్తారని సమాచారం.
కాగా ఈ సభకు హైదరాబాద్ నుంచీ కేసీఆర్ రోడ్డు మార్గంలో రానున్నారు. అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను అధికారులు చేశారు. మొత్తం లక్ష మందిని సభకు తరలించాలని టీఆర్ఎస్ వర్గాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చాలా మంది మంత్రులు అక్కడే ఉండి ఏర్పాట్లను చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







