ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు
- October 28, 2019
వాషింగ్టన్: శ్వేత సౌధంలో జరిగిన దీపావళి వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందడి చేశారు. దీపాలు వెలిగించి కాసేపు ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. ఈ మేరకు ఒక వీడియోను ఆయన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతోపాటు ఒక ప్రకటన విడుదల చేశారు.
' అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ, జైనులు, సిక్కులు, బౌద్ధులకు దీపావళి శుభాకాంక్షలు. చీకటిని చీల్చుకు వచ్చే వెలుతురుకి దీపావళి ప్రతీక. అదే విధంగా దుష్ట సంహారం జరిగిన తర్వాత చేసుకునే పండగ ఇది. చెడుపై మంచి గెలిచిన శుభతరుణం. దుర్మార్గంపై సన్మార్గం విజయం సాధించిన సమయం. ఈ పవిత్ర పండుగ నాడు అందరి జీవితాల్లో వెలుగులు నిండాలి. మీ కుటుంబ సభ్యులు, బంధువులకు అంతా శుభమే జరగాలి' అని అన్నారు. మరో ప్రకటనలో 'మా పరిపాలనా యంత్రాంగం అమెరికాలో ఉన్న విదేశీయుల సంప్రదాయాన్ని గౌరవిస్తుంది. వారి హక్కులు, నమ్మకాలు, గౌరవాలను కాపాడుతుంది. ఈ ఏడాది మీ అందరి జీవితాల్లో ప్రేమ, వెలుగులు, శాంతి నిండాలని మేం కోరుకుంటున్నాం' అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







