సైనికుడిగా రానా..!
- October 28, 2019హైదరాబాద్: రానా దగ్గుబాటి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం '1945'. ఈ సినిమాకు శివకుమార్ దర్శకత్వం వహించారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు శివకుమార్ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'మూడేళ్ల తర్వాత నా సినిమా పూర్తయ్యింది. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. దేశభక్తి, ఒక ఐఎన్ఏ సైనికుడి ప్రేమ.. అనే భావోద్వేగాల మధ్య జరిగిన యుద్ధమే.. '1945' అని దర్శకుడు పేర్కొన్నారు.
ఐఎన్ఏ సైనికుడి పాత్రలో రానా నటిస్తున్న ఈ చిత్రాన్ని కె.ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్.ఎన్.రాజరాజన్ నిర్మించారు. యువన్ శంకర్ రాజా స్వరాలను అందించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాని జనవరి 24న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు రానా 'విరాటపర్వం 1942' సినిమాలో నటిస్తున్నారు. వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి కథానాయిక.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్