ఫలించని ప్రయత్నం..సుజిత్‌ మృతి

- October 29, 2019 , by Maagulf
ఫలించని ప్రయత్నం..సుజిత్‌ మృతి

 

చెన్న: బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి సుజిత్‌ను సజీవంగా వెలికి తీయాలన్న ప్రయత్నాలు ఫలించలేదు. బాలుడిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. లోపలి నుంచి దుర్వాసన వస్తుండడంతో సుజిత్ చనిపోయాడని నిర్ధారించి సహాయక చర్యలు నిలిపివేశారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా నాడుకట్టుపట్టికి చెందిన సుజిత్ విల్సన్ ఈ నెల 25న ఆడుకుంటూ 600 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. 100 అడుగుల లోతులో బాలుడు చిక్కుకుపోయినట్టు గుర్తించిన అధికారులు రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వారు. అయితే, బండరాళ్ల కారణంగా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. బాబుకు ఆక్సిజన్ అందిస్తూ వచ్చారు. మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతుండగా సోమవారం బావి నుంచి దుర్వాసన వస్తుండడంతో చిన్నారి మృతి చెందినట్టు నిర్ధారించి సహాయక చర్యలు నిలిపివేశారు. సుజిత్ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాలుగు రోజుల నుండి ఆహారం లేక అపస్మారక స్థితికి వెళ్లిన సుజిత్‌ మరణించినట్లు అధికారులు గుర్తించారు. భౌతికకాయం పూర్తిగా కుళ్లినట్లు గుర్తించారు. ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకు తీశారు. మనప్పారై ప్రభుత్వాసుపత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com