పెట్రోల్‌ ధరల్నిసవరించిన యూఏఈ

- October 29, 2019 , by Maagulf
పెట్రోల్‌ ధరల్నిసవరించిన యూఏఈ

యూఏఈ ఫ్యూయల్‌ ప్రైస్‌ కమిటీ, నవంబర్‌ 2019 కోసం ఫ్యూయల్‌ ధరల్ని సవరించింది. సవరించిన ధరల ప్రకారం సూపర్‌ 98 పెట్రోల్‌ ఇకపై లీటర్‌కి 2.20 దిర్హామ్‌లకు చేరుకుంటుంది. అక్టోబర్‌తో పోల్చితే ఈ ధర తగ్గింది. అక్టోబర్‌లో 2.24 దిర్హామ్‌లుగా ఈ ధర వుంది. కాగా, అక్టోబర్‌లో 2.12 దిర్హామ్‌లు వున్న స్పెషల్‌ 95 పెట్రోల్‌ ధర ఇకపై 2.09 దిర్హామ్‌లకు లభిస్తుంది. డీజిల్‌ ధర అక్టోబర్‌లో 2.41 వుండగా, అదిప్పుడు 2.38గా మారనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com