ఆరాంకో ఐపీవోకు సౌదీ యువరాజు అనుమతి
- November 02, 2019
సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ చమురు ఉత్పత్తి సంస్థ ఆరాంకో ఐపీవోకు వెళ్లేందుకు ఆ దేశ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఆరాంకో ఐపీవోపై ఆదివారం అధికారిక ప్రకటన చేసే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.
ప్రస్తుతం ఆరాంకో మార్కెట్ విలువ 1.5 నుంచి 1.7 ట్రిలియన్ డాలర్ల మధ్య ఉంది. ఈ ఐపీవో ద్వారా ఆరాంకో 5శాతం షేర్లను విక్రయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజీ తడావుల్‌లో డిసెంబరులో ఈ ఐపీవో లిస్టింగ్‌కు రానుంది. వచ్చే ఏడాది అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టాలని కంపెనీ భావిస్తున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఐపీవోలో షేర్ల ధర తదితర వివరాలను రేపు వెల్లడించనున్నారు. నిజానికి అక్టోబరులోనే ఈ ఐపీవో ప్రారంభం కావాల్సి ఉండగా కంపెనీ మార్కెట్ విలువపై సౌదీ యువరాజు అంసతృప్తి వ్యక్తం చేయడంతో ఆలస్యమైంది.
భారత్‌కు చెందిన రిలయన్స్ గ్రూప్‌లో సౌదీ ఆరాంకో దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. రిలయన్స్ ఆయిల్ టు డివిజన్‌లో ఆరాంకో 20శాతం వాటాలను కొనుగోలు చేయనుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..