వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్..
- November 03, 2019
ఎప్పటికప్పుడు కొత్త ప్యూచర్లతో వినియోగదారులకు సరికొత్త సేవలు అందిస్తోన్న వాట్సాప్.. మరో ప్యూచర్‌ను తీసుకొచ్చింది.. వాట్సాప్ వినియోగదారులు ఎప్పట్నుంచో కోరుతోన్న ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఐవోఎస్ వినియోగదారులకు ఎప్పుడో అందుబాటులోకి వచ్చేయగా.. ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే మీ స్మార్ట్ ఫోన్ మరొకరి చేతిలో ఉన్నా.. ఓపెన్ చేసి చూసే అవకాశం మాత్రం ఉండదు.. మీ ఫింగర్ ప్రింట్‌తోనే ఓపెన్ అవుతుంది.
వాట్సాప్‌లో ఫింగర్ ప్రింట్ ఫీచర్ పొందడం ఎలా? అంటే ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.. అందులో అకౌంట్ సెట్టింగ్స్ పై క్లిక్ చేసి.. ప్రైవసీలోకి వెల్లాలి.. అక్కడ ఫింగర్ ప్రింట్ లాక్ కనిపిస్తుంది.. దానిపై ట్యాప్ చేసి ఎనేబుల్ చేస్తే.. మీరు ఫింగర్ ప్రింట్ ఇచ్చాక, మీ ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ నే వాట్సాప్ అన్ లాక్ చేయడానికి కూడా ఉపయోగించమంటారా?
అని అడుగుతుంది. అప్పుడు మీరు దాన్ని కన్ ఫర్మ్ చేస్తే చాలు. ఇక, ఆ ఆప్షన్ కింద మీకు ఒక టైమర్ కూడా కనిపిస్తుంది. లాక్‌కు సంబంధించిన సమయాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. మరోవైపు మరిన్ని ఫీచర్లు కూడా వాట్సాప్‌లో రానున్నాయి.. డార్క్ మోడ్, మల్టీ ప్లాట్ ఫాం, పేమెంట్ వంటి మరెన్నో ఫీచర్లు వాట్సాప్‌లోకి రానున్నాయట.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







