అబుధాబి: 7,000 ప్రదేశాలలో 300,000 సిసిటివిలను ఏర్పాటు

- November 03, 2019 , by Maagulf
అబుధాబి: 7,000 ప్రదేశాలలో 300,000 సిసిటివిలను ఏర్పాటు

అబుధాబి: నేరాలను అరికట్టేందుకు అబుధాబిని పూర్తిగా నిఘా నీడలోకి తీసుకొచ్చారు అక్కడి అధికారులు. నగరంలో ప్రజల భద్రతా దృష్ట్యా 7వేల బహిరంగ ప్రదేశాల్లో 3లక్షలకు పైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు అబుదాబి పర్యవేక్షణ, నియంత్రణ కేంద్రం(ఎంసీసీ) అధికారులు వెల్లడించారు. అబుధాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేత స్థాపించబడిన ప్రభుత్వ విభాగం తరఫున 7,029 ప్రదేశాల్లో 3,01,798 సీసీటీవీ కెమెరాలు అమర్చామన్నారు. అబుధాబి ఎమిరేట్‌లో రక్షణ మరియు భద్రతను నిర్ధారించడం మా ప్రధాన లక్ష్యమని వారు తెలిపారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, సీసీటీవీలు కీలకమైన సాక్ష్యంగా పనిచేస్తాయని ఎంసీసీ అధికారులు పేర్కొన్నారు. నేరం చేసిన వ్యక్తి  ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా గుర్తించడానికి, ఇతర భౌతిక లక్షణాలను గుర్తించడానికి, వాహనం యొక్క నంబర్ ప్లేట్‌ను సంగ్రహించడానికి ఈ కెమెరాలు సహాయపడతాయన్నారు. అలాగే తమ పరిధిలోకి రాని కొన్ని ప్రాంతాల్లో సొంతగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు ఈ సందర్భంగా అనుమతి మంజూరు చేశారు. దీనికోసం అవసరమైన కెమెరాలు, ఇతర సామాగ్రిని తామే సమాకూర్చడం జరుగుతుందన్నారు.మేము అవసరమైన పరికరాలను అందిస్తాము మరియు ఖర్చుతో కూడుకున్న మార్గాలను సూచిస్తున్నాము. సిసిటివిలకు సంబంధించి లేదా సిసిటివి కాంట్రాక్టర్లతో సమస్యలకు సంబంధించి అవసరమైన అన్ని మద్దతులను కూడా మేము అందిస్తున్నాము అని అధికారులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com