'బిగ్బాస్ సీజన్-3' విజేత గా రాహుల్ సిప్లిగంజ్
- November 03, 2019
హైదరాబాద్:బిగ్బాస్: సీజన్-3 టైటిల్ను గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి చేతుల మీదుగా రూ.50లక్షల నగదు బహుమతి, ట్రోఫీని అందుకున్నారు. 15 వారాల పాటు ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ షోలో రాహుల్ విజేతగా నిలిచారు. యాంకర్, నటి శ్రీముఖి చివరి వరకూ రాహుల్కు గట్టి పోటీ నిచ్చారు. ఈ సందర్భంగా తనని విజేతగా నిలిపిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. తన విజయంలో తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రేక్షకులు ఎంతో సహకరించారని వారి ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.
ఈ ఏడాది జులై 21న ప్రారంభమైన బిగ్బాస్: సీజన్-3కు అగ్ర నటుడు నాగార్జున వ్యాఖ్యాత వ్యవహరించారు. రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా, శివజ్యోతి, వితిక, మహేశ్ విట్టా, పునర్నవి భూపాలం, రవి కృష్ణ, హిమజ, శిల్పా చక్రవర్తి, అషురెడ్డి, రోహిణి, తమన్నా సింహాద్రి, జాఫర్, హేమ ఇంట్లోకి వచ్చారు. వీరిలో కేవలం రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా మాత్రమే ఫైనల్కు చేరారు. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు రాహుల్కు రావడంతో ఆయన విజేతగా నిలిచారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







