కువైట్ లో ఏ.పి వాసి మృతి
- November 03, 2019
కువైట్:కువైట్ వెళ్లిన రాజంపేటలోని నందలూరుకు చెందిన షేక్ మహమ్మద్ రఫీ(34) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. రఫీ కొన్నేళ్లుగా కువైట్‌లో సీసీటీవీ కెమెరాల టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 19న జాబిరియా ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో కెమెరా బిగిస్తుండగా ప్రమాదవశాత్తు నిచ్చెనపై నుంచి కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడ్ని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 28న రఫీ చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ కన్వీనర్లు సేవాదళ్ ఇన్‌చార్జి గోవిందు రాజు ద్వారా భారత రాయబార కార్యాలయంలో ఇమ్మిగ్రేషన్ పనులన్నీ పూర్తి చేశారు. బాడీ బాక్స్‌కు అయిన రూ.14వేలు బాలిరెడ్డి భరించగా, చెన్నై విమానాశ్రయం నుంచి నందలూరు వరకూ రాష్ట్ర ప్రభుత్వ ఏపీ ఎన్‌ఆర్‌టీ కార్పొరేషన్ వారు ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని ఇలియాస్, బాలిరెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







