ఆధార్ కార్డు ఉంటే ఆన్లైన్లో ఉచితంగా పాన్ నంబరు
- November 05, 2019
న్యూఢిల్లీ : కేంద్ర ఆదాయ పన్ను శాఖ ప్రజలకు శుభవార్త వెల్లడించింది. ఇక నుంచి ఆధార్ కార్డు ఉండి పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్లో ఉచితంగా పాన్ నంబరును తక్షణమే అందించాలని ఆదాయపు పన్నుశాఖ నిర్ణయించింది. పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వారి ఆధార్ డేటాతో ఒన్ టైమ్ పాస్వర్డ్ తో తక్షణమే ఎలాంటి జాప్యం లేకుండా ఈ-పాన్ ను జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆధార్ కార్డులో ఉన్న చిరునామా, తండ్రి పేరు, పుట్టిన తేదీల ఆధారంగా ఈ-పాన్ కార్డులను తక్షణమే జారీ చేయనున్నారు. డిజిటల్ సంతకంతో కూడిన పాన్ కార్డును క్యూఆర్ కోడ్ తో అందించాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. దీంతోపాటు పాన్ కార్డు ఫోర్జరీ చేయకుండా డిజిటల్ పోటోషాపింగ్ తో తక్షణమే జారీ చేయాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..