నేషనల్‌ మరియు ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మ్యూజియంలలో సందర్శకులకి అనుమతి

నేషనల్‌ మరియు ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మ్యూజియంలలో సందర్శకులకి అనుమతి

మస్కట్‌: నేషనల్‌ మ్యూజియం మరియు  ఆర్మ్‌డ్‌   ఫోర్సెస్‌ మ్యూజియంలు ప్రొఫెట్‌ మొహమ్మద్‌ జయంతి సెలవు నేపథ్యంలో సందర్శకులకు తెరిచి వుంటాయి. నేషనల్‌ మ్యూజియం ఈ మేరకు ఆన్‌లైన్‌ ద్వారా ప్రకటన విడుదల చేసింది. ఆదివారం (నవంబర్‌ 10) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ మ్యూజియం తెరిచి వుంటుంది. మరోపక్క, సుల్తానేట్‌కి చెందిన ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మ్యూజియం కూడా సెలవు దినమైన ప్రొఫెట్‌ మొహమ్మద్‌ జయంతి రోజున సందర్శకుల కోసం తెరిచే వుంటుంది.

Back to Top