బిగ్ బ్రేకింగ్:రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
- November 09, 2019
దాదాపు శతాబ్ధంన్నర్రగా వివాదాస్పదమైన అయోధ్య రామజన్మభూమి స్థలం హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. 1856 నుంచి హిందూ- ముస్లిం సంస్థల మధ్య వివాదానికి కారణమైన 2.77 ఎకరాల స్థలాన్ని అయోధ్య చట్టప్రకారం ఏర్పాటుచేసే ఆలయ ట్రస్ట్‌కు అప్పగించాలని సుప్రీం, ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తంతును మూడు నెలల్లో పూర్తి చేయాలని ధర్మాసనం నిర్దేశించింది. అదే సమయంలో ముస్లిం మతవిశ్వాసాలకు ప్రాధాన్యతనిస్తూ.. అయెధ్యలోనే ఐదెకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా చేస్తూ గతంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది. వివాదాస్పద స్థలం మీద తమకు హక్కు ఉందని సున్నీ వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయిందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే మత విశ్వాసాల ఆధారంగా కాకుండా పురావస్తు శాఖ నివేదిక ప్రాతిపదికనే సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించినట్లు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







