ఖతార్ ఎయిర్ వేస్ - ఇండిగో మధ్య కోడ్‌షేర్ ఒప్పందం
- November 09, 2019
ఖతార్ ఎయిర్ వేస్ తమ ప్రయాణీకులకు మరింత మెరుగైన సౌకర్యాల్ని కల్పించే క్రమంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దోహా నుంచి ఢిల్లీ, ముంబై మరియు హైద్రాబాద్‌లకు నడిచే ఇండిగో విమానాలకు ఇకపై క్యుఏ కోడ్‌ని పొందుపర్చుతారు. తొలి కోడ్ షేర్ విమానాలకు సంబంధించి సేల్స్ ఇప్పటికే ప్రారంభించినట్లు ఇరు వర్గాలూ వెల్లడించాయి. డిసెంబర్ 18 నుంచి కొత్త కోడ్‌షేర్‌తో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. ఖతార్ ఎయిర్‌వేస్‌తో ఒప్పందం చాలా ఆనందంగా వుందని ఇండిగో సీఈఓ రోనోజోయ్ దత్తా పేర్కొన్నారు. ఈ వ్యూహాత్మక ఒప్పందం తమ అంతర్జాతీయ సర్వీసులకు మరింత ఊతమిస్తుందని ఆయన తెలిపారు. ఖతార్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అక్బర్ అల్ బకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..