భారత రాయబార కార్యాలయంపై దాడిలో పాకిస్తాన్ సైనికాధికారులు??
- January 12, 2016
భారత రాయబార కార్యాలయంపై గత వారం జరిగిన దాడిలో పాకిస్థాన్‌కు చెందిన సైనికాధికారులు పాల్గొన్నారని ఆఫ్ఘనిస్థాన్ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు.'మేం మా కళ్లతో స్వయంగా చూశాం. దాడికి పాల్పడిన వారిలో పాకిస్థాన్ సైనికాధికారులున్నారని 99 శాతం కచ్చితంగా చెప్పగలం' అని బాల్ఖ్ రాష్ట్ర పోలీసు అధిపతి సయ్యద్ కమాల్ సాదత్ తెలిపారు.వారు బాగా శిక్షణ పొందిన వ్యక్తులని, పూర్తి నిఘా సమాచారంతో దాడికి దిగారని చెప్పారు. అయినప్పటికీఅల్లాదయతో వారిని సమర్థవంతంగా ఎదుర్కోవటమేగాక, మట్టబెట్టగలిగామని చెప్పారు.దాడికి దిగిన వారికి సాయం అందించిన వ్యక్తులను గుర్తించే పని ప్రస్తుతం జరుగుతోందని తెలిపారు.ఇటీవల వరుసగా రెండు సార్లు భారత దౌత్య కార్యాలయంపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు, సైనికాధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. రెండు దాడులను ఆప్ఘాన్ పోలీసులు, భద్రతా దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







