కువైట్‌లో ఘోర ప్రమాదం.. కేరళ నర్సు మృతి..

- November 10, 2019 , by Maagulf
కువైట్‌లో ఘోర ప్రమాదం.. కేరళ నర్సు మృతి..

కువైట్ సిటీ: కువైట్‌లో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ రాష్ట్రానికి చెందిన నర్సు మృత్యువాతపడింది. ఈ దుర్ఘటనలో మరో ఐదుగురు నర్సులు స్వల్పంగా గాయపడ్డారు. మృతురాలిని కేఆర్‌హెచ్ కంపెనీ తరఫున కేఓసీ ఆసుపత్రిలో పనిచేస్తున్న మేరీగా గుర్తించారు. విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న నర్సుల వాహనాన్ని మరో ప్రైవేట్ వాహనం ఢీకొట్టింది. దీంతో అందులోంచి మేరీ అమాంతం వాహనం వెనక చక్రం కింద పడిపోయింది. ఆమెపై నుంచి వాహనం వెళ్లిపోవడంతో అక్కడికక్కడే చనిపోయింది. మరో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాదస్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని అదాన్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఆరో రోడ్, అహ్మదీ రోడ్ల మధ్య శనివారం రాత్రి 9 గంటలకు చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మేరీ భర్తతో పాటు కువైట్‌లో ఉంటున్నట్లు సమాచారం. వారి కూతురు మాత్రం కేరళలోనే ఉంటుంది. మేరీ మృతివార్తతో ఆమె స్వస్థలంలో విషాదచాయలు అలుముకున్నాయి. తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలుసుకొని కూతురు గుండెలవిసేలా విలపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com