'మార్కెట్రాజా ఎంబీబీఎస్': 'దాదా'గా సీనియర్ తార రాధిక
- November 12, 2019పలు చిత్రాల్లో రౌడీ తరహా పాత్రల్లో నటించిన సీనియర్ తార రాధిక మరోసారి దాదాగా ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. 'బిగ్‌బాస్' ఫేమ్ ఆరవ్ హీరోగా దర్శకుడు చరణ్ తెరకెక్కించిన 'మార్కెట్రాజా ఎంబీబీఎస్'లో రాధిక ఆహార్యం కూడా భిన్నంగా ఉంది. నోటిలో చుట్ట పెట్టుకుని, బుల్లెట్ నడుపుతూ ఉన్న స్టిల్స్ ఆమె పాత్ర పట్ల ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సురభి ఫిలింస్ బ్యానర్‌పై హారర్ కామెడీగా రూపొందిన 'మార్కెట్రాజా ఎంబీబీఎస్'ను ఈనెల 29వ తేదీ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో యువతార కావ్య తపర్, గ్లామరస్ హీరోయిన్ నికిషా పటేల్ హీరోయిన్లుగా నటించారు. ఆరవ్ తల్లి పాత్రను రాధిక పోషించారు. ఇక 'సైతాన్', 'ఓకే కన్మణి' తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆరవ్ సోలో హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా శ్రమిస్తున్నాడు. ఆ కలను 'మార్కెట్రాజా ఎంబీబీఎస్' నెరవేరస్తుందని ఆశలు పెట్టుకున్నాడు. అలాగే హీరోయిన్ కావ్య తపర్ కూడా ఈ చిత్రం ద్వారా తమిళంలో మంచి పేరు వస్తుందన్న నమ్మకంతో ఉంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి