దుబాయ్: భారతీయుడ్ని చంపిన పాక్ వ్యక్తికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
- November 12, 2019
దుబాయ్: విధి ప్రేరేపిత దుర్ఘటన అన్యాయంగా భారతీయున్ని పొట్టనపెట్టుకుంది...వివరాల్లోకి వెళ్తే.. భారత వ్యక్తిని హతమార్చిన పాకిస్తానీకి సోమవారం దుబాయ్ కోర్టు జీవిత ఖైదు విధించింది. సోదరుడితో ఉన్న గొడవ కారణంగా తిరిగి స్వదేశానికి వెళ్లే ఇష్టంలేక ఏదైనా నేరం చేసి జైలుకు వెళ్లాలనే ఆలోచనతో నిందితుడు తనతో పాటు పనిచేస్తున్న భారత కార్మికుడిని హత్య చేసినట్టు కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అలాగే 25 ఏళ్ల శిక్ష కాలం పూర్తైన వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించింది. కోర్టులో తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఏడాది ఫిబ్రవరి 26న నద్ అల్ హామర్ లో భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్న పాక్, భారత్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులు పనిచేసే చోట ఘర్షణ పడ్డారు. అప్పటికే ఇంట్లో సోదరుడి సమస్యతో స్వదేశానికి వెళ్లే ఇష్టంలేని పాక్ వ్యక్తి అదే అదునుగా భావించి భారత వ్యక్తిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే కిందపడేసి గొంతును బట్టతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేశాడు.
అది గమనించిన తోటి కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తన సోదరుడితో ఉన్న విభేదాల కారణంగా స్వదేశానికి వెళ్లే ఇష్టంలేక ఎదైనా నేరం చేసి జైలుకు వెళ్లాలనే ఆలోచనతో వ్యక్తిని హతమార్చినట్టు తెలిపాడు. అంతేగాక తాను చంపిన వ్యక్తితో తనకు పాత గొడవలు కూడా ఉన్నట్లు చెప్పాడు. ఒకసారి తన నగ్న వీడియోలు తీసి తన సోదరుడికి పంపించాడని, అప్పటి నుంచి ఇంట్లో సమస్యగా మారిందన్నాడు. అందుకే తోటి కార్మికుడిని హత్య చేసినట్టు నిందితుడు చెప్పుకొచ్చాడు. దాంతో అల్ రషీదియా పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై హత్య కేసు నమోదైంది. సోమవారం ఈ కేసు దుబాయ్ కోర్టులో విచారణకు వచ్చింది. తన నేరాన్ని అంగీకరించడంతో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా, నిందితుడికి కోర్టు తీర్పుపై 15 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..