మరో అద్భుతాన్ని ఆవిష్కరించనున్న నాసా
- November 12, 2019
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) గత కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయోగాలు కొలిక్కివచ్చాయి. విద్యుత్ ఇంధనంతో నడిచేలా నాసా రూపొందించిన విమానం త్వరలో గాల్లోకి ఎగరనుందని సంస్థ తన ట్విట్టర్‌లో పేర్కొంది. ఇప్పటికే ఈ విమానాన్ని తమ ఏరోనాటిక్ ప్రయోగశాలలో పరీక్షించామని, ఫలితం సంతృప్తిగా ఉందని నాసా పేర్కొంది. ఏడాది కాలంలోపు ఎడ్వర్డ్ వైమానిక దళ బేస్ నుంచి ఇది గాల్లోకి ఎగురుతుందని పేర్కొంది. 14 మోటార్లతో నడిచే ఈ విమానానికి మాక్స్‌వెల్ 'ఎక్స్57' అని పేరు పెట్టింది. 2015లో తయారీ ప్రారంభమైన ఈ విమానాన్ని ఇటలీకి చెందిన టెక్నాం పీ2006టీ విమానం ఆధారంగా తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్ బ్రెంట్ కోబ్‌లీ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఇప్పటికే పలు కంపెనీలు విద్యుత్ ఇంధన ఆధారిత విమానాల తయారీలో నిమగ్నమై ఉన్నప్పటికీ నాసా రూపొందించిన ఈ విమానం ప్రభుత్వం ధ్రువీకరించిన వాణిజ్య ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోందని చెప్పారు. నాసా తన ఇరవై ఏళ్ల చరిత్రలో రూపొందించిన విమానాల్లో ఇది మొదటిదని తెలిపారు. కేవలం నాసాకే కాకుండా మొత్తం విమాన పరిశ్రమే ఈ తరహా విమానాలు తయారు చేసేలా సాంకేతిక పరిజ్ఞానం రూపొందుతోందని బ్రెంట్ తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం







