అల్‌ అయిన్‌ జూ సందర్శకులకు 48 శాతం డిస్కౌంట్‌

అల్‌ అయిన్‌ జూ సందర్శకులకు 48 శాతం డిస్కౌంట్‌

యూఏఈ: అల్‌ అయిన్‌ జూ, విజిటర్స్‌కి స్పెషల్‌ ఆఫర్స్‌ మరియు డిస్కౌంట్స్‌తో ఆహ్వానం పలుకుతోంది. ప్రతి ఎంట్రీ మరియు సఫారీ ట్రక్‌ టిక్కెట్స్‌పై 48 శాతం డిస్కౌంట్‌ ప్రకటించారు నిర్వాహకులు. అయితే, టిక్కెట్లను వెబ్‌సైట్‌ లేదా స్మార్ట్‌ ఫోన్‌ అప్లికేషన్‌ ద్వారా బుక్‌ చేసుకోవాల్సి వుంటుంది. నవంబర్‌ 1 నుంచి 29 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో వుంటుంది. టిక్కెట్లు కొనుగోలు చేసిన తేదీ నుంచి 30 రోజలపాటు చెల్లుబాటవుతాయి. సందర్శకులకు ఇది గొప్ప అవకాశమని అల్‌ అయిన్‌ జూ మార్కెటింగ్‌ అండ్‌ కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ ఒమర్‌ యూసుఫ్‌ అల్‌బలూషి చెప్పారు.

 

Back to Top