కేరళ వనిత..వివాహేతర ప్రేమకు ఆస్ట్రేలియా కోర్ట్ కొరడా
- November 12, 2019
కేరళలో నూనె వ్యాపారం చేసేవాడు శ్యామ్. సోఫియా అనే యువతిని ఇచ్చి ఆరేళ్ళ క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. ప్రశాంతంగా సాగిపోతున్న వీరి జీవితంలో వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చింది. పెళ్ళి కాకముందు నుంచి ఉన్న ప్రియుడిని వదులుకోలేక భర్తను అతి దారుణంగా చంపేసింది భార్య.
కేరళలో రెండు సంవత్సరాల పాటు ఉన్న ఈ ప్రేమ జంట ఆస్ట్రేలియాలో స్థిరపడింది. సోఫియా ప్రియుడు అరుణ్ కూడా అక్కడే ఉండేవాడు. సోఫియాకు కొడుకు పుట్టిన తరువాత అరుణ్‌తో సోఫియా రెగ్యులర్‌గా కలుస్తూ ఉండేది. వీరి మధ్య సంవత్సరానికి పైగా వివాహేతర సంబంధం కొనసాగుతూ వచ్చింది.
అయితే శ్యామ్ ఆస్ట్రేలియాలో బాగానే ఆస్తులు కూడబెట్టాడు. భర్తతో కాపురం చేయడానికి ఇష్టపడని సోఫియా ఎలాగైనా అతన్ని చంపేయాలని ప్రియుడు అరుణ్‌తో కలిసి ప్లాన్ చేసింది. సైనైడ్ కలిపిన ఆరెంజ్ జ్యూస్ తాగించింది. దీంతో శ్యామ్ అక్కడికక్కడే చనిపోయాడు. దీనితో తన భర్త గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు శ్యామ్‌కు పోస్టుమార్టం నిర్వహించగా అసలు విషయం బయటపడింది. ప్రియుడు అరుణ్‌కు 25 యేళ్ళ జైలు, సోఫియాకు 22 యేళ్ళ జైలు శిక్ష విధించింది ఆస్ట్రేలియా కోర్టు.
తాజా వార్తలు
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం







