కశ్మీర్‌పై వెనక్కి తగ్గిన బ్రిటన్‌ లేబర్‌ పార్టీ

- November 13, 2019 , by Maagulf
కశ్మీర్‌పై వెనక్కి తగ్గిన బ్రిటన్‌ లేబర్‌ పార్టీ

లండన్‌: కశ్మీర్‌లోకి అంతర్జాతీయ పరిశీలకులను అనుమతించాలని, అక్కడ ప్రజలకు నిర్ణయాధికారాన్ని కల్పించాలని బ్రిటన్‌లోని ప్రధాన ప్రతిపక్షం అయినలేబర్‌ పార్టీ నాయకుడు జెరెమి కోర్బిన్‌ గత సెప్టెంబర్‌లో ఐరాస నేతృత్వంలో డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా అక్కడి భారతీయ వర్గాల నుండి త్రీవస్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో తమ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ పార్టీ ఛైర్మన్‌ ఇయాన్‌ లావెరీ తెలిపారు. కశ్మీర్‌ అంశం ద్వైపాక్షిక అంశమని తేల్చి చెప్పారు, ఇతర దేశాల వ్వవహారాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. కశ్మీర్‌పై భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించబోమని, అంతర్జాతీయ పరిశీలనకు అనుమతించాలంటూ చేసిన తీర్మానం భావోద్వేగ సందర్భంలో తీసుకోవాల్సివచ్చిందని అభివర్ణించారు. కాగా అప్పట్లో భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసమే లేబర్‌ పార్టీ ఇటువంటి చర్యలకు దిగిందని వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com