షెర్టన్‌ పార్క్‌లో అండర్‌గ్రౌండ్‌ పార్కింగ్‌

- January 12, 2016 , by Maagulf
షెర్టన్‌ పార్క్‌లో అండర్‌గ్రౌండ్‌ పార్కింగ్‌


నాలుగు లెవల్స్‌తో కూడిన 2800 వాహనాల సామర్థ్యం కలిగిన పార్కింగ్‌ సౌకర్యం షెర్టాన్‌ పార్క్‌లో అందుబాటులోకి రానుంది. ఈ నెలాఖరు లేదా, వచ్చే నెల మొదటివారంలో అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌ని అందుబాటులోకి తీసుకు రానున్నామనీ, దీనికోసం జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉందని షెర్టన్‌ వర్గాలు వెల్లడించాయి. షెర్టాన్‌ దోహా హోటల్‌ ఎదురుగా ఉన్న కొత్త పబ్లిక్‌ పార్క్‌ వారాంతాల్లో కుటుంబ సమేతంగా ఎంజాయ్‌ చెయ్యడానికి వీలుగా రూపొందించారు. ఫిట్‌నెస్‌ ఎక్విప్‌మెంట్‌తో కూడిన మినీ ప్లేగ్రౌండ్‌ ఈ పార్క్‌లో ప్రధాన ఆకర్షణ కానుంది. ఏడు హెక్టార్లలో తీర్చిదిద్దిన పబ్లిక్‌ గార్డెన్‌లోని ల్యాండ్‌స్కేపింగ్‌ అందర్నీ ఆకట్టుకోనుంది. ఫౌంటెయిన్స్‌, మినీ వాటర్‌ ఫాల్స్‌ సందర్శకుల్ని ఆకట్టుకుంటాయి. సందర్శకుల వాహనాల పార్కింగ్‌ కోసం తగిన చర్యలు చేపట్టామని షెర్టన్‌ పార్క్‌ వర్గాలు చెప్పాయి. కొత్త పార్కింగ్‌లో అవసరమైన మేరకు ఎంట్రీ, ఎగ్జిట్‌ మార్గాల్ని ఏర్పాటు చేశారు. కార్‌ పార్క్‌ బిల్డింగ్‌లో కొంత భాగం ఎయిర్‌ కండిషన్డ్‌గానూ మలచారు. 12కి పైగా ఎలివేటర్స్‌తో, అత్యద్భుతంగా ఈ పార్కింగ్‌ స్పాట్స్‌ని తీర్చిదిద్దారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com