అరేబియన్‌ గల్ఫ్‌ కప్‌లో పాల్గొననున్న బహ్రెయిన్‌

- November 14, 2019 , by Maagulf
అరేబియన్‌ గల్ఫ్‌ కప్‌లో పాల్గొననున్న బహ్రెయిన్‌

24వ అరేబియన్‌ గల్ఫ్‌ కప్‌లో బహ్రెయిన్‌ పాల్గొంటోంది. బహ్రెయిన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (బిఎఫ్‌ఎ) ఈ విషయాన్ని ప్రకటించింది. అరబ్‌ గల్ఫ్‌ కప్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ నుంచి అందిన ఆహ్వానం మేరకు బిఎఫ్‌ఎ ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం ఆరు దేశాలు ఈ పోటీల్లో తలపడనున్నాయి. బహ్రెయిన్‌తోపాటుగా ఖతార్‌, కువైట్‌, యెమెన్‌, ఇరాక్‌ అలాగే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఒమన్‌ ఈ పోటీల్లో తలపడుతున్నాయి. ఖతార్‌ రాజధానిలోని ఖలీఫా ఇంటర్నేషనల్‌ స్టేడియం ఈ పోటీలకు వేదిక కానుంది. గల్ఫ్‌ కప్‌కి ముందుగా బహ్రెయిన్‌ సీనియర్‌ మెన్‌ నేషనల్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌, పిఫా వరల్డ్‌కప్‌ 2020 అలాగే ఎఎఫ్‌సి ఏసియన్‌ కప్‌ 2023 పోటీలకు సంబంధించిన క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌లు ఆడబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com