ట్రంప్‌పై అభిశంసన తీర్మానం

- November 14, 2019 , by Maagulf
ట్రంప్‌పై అభిశంసన తీర్మానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అభిశంసన ప్రక్రియ ప్రారంభమైంది. అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేసినందుకు ఆయనను అభిశంసించాలంటూ డెమొక్రాట్లు ఇప్పటికే తీర్మానాన్ని ఆమోదించారు. ట్రంప్ అభిశంసనపై జరిగుతున్న విచారణ అంతా తొలిసారిగా లైవ్ లో ప్రసారం చేశాయి. బుధవారం జరిగిన తొలి రోజు విచారణను హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ తన టెలివైజ్డ్ ద్వారా చేపట్టింది.

వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ నేత, మాజీ ఉపాధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బిడెన్ నుంచి ట్రంప్ కు గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో బిడెన్ ను దెబ్బకొట్టేందుకు ఉక్రెయిన్ సాయం కోరారు అనేది అతనిపై ఉన్న ఆరోపణ. అందుకు ప్రతిఫలంగా ఉక్రెయిన్ ఆర్ధిక సాయం అందించేందుకు కూడా ట్రంప్ సిద్దమయ్యాడు. బిడెన్ తో పాటు అతని కుమారుడిపై ఉన్న అవినీతి కేసుతో విచారణ వేగవంతం చేయాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్ స్కీ ని ఫోన్ లో కోరారని ట్రంప్ విమర్శలు ఎదుర్కుంటున్నారు.

ట్రంప్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తో మాట్లాడిన విషయం నిఘా వర్గాల ద్వారా డెమొక్రాట్లకు చేరింది. ట్రంప్ చర్యలు అధ్యక్ష పదవికి, దేశ భద్రతకు, ఎన్నికల విశ్వసనీయతను మోసం చేసేలా ఉన్నాయని డెమొక్రాట్ల ప్రతినిధి బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టానికి ఎవరు అతీతులు కాదంటూ అభిశంసనకు ప్రక్రియకు ఆమోదం తెలిపింది. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ విచారణలో ఉక్రెయిన్ కి తాత్కాలిక రాయబారి విలియం బీ.టేలర్ జూనియర్ అలాగే యూరోపియన్ యురేషియన్ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జార్జ్ కెంట్, ఉక్రెయిన్ కి మాజీ అమెరికా రాయబారి మేరీ మాషా యునోవిచ్ తమ వాంగ్మూలాలు ఇవ్వనున్నారు. 13 మంది డెమొక్రాట్లు, 9 మంది రిపబ్లికన్లు.. మొత్తం 22 మంది హౌస్ మెంబర్లతో కూడిన కమిటీ విచారణను పర్యవేక్షిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com