దుబాయ్: చెత్త కుప్ప లో మృతశిశువుని పారేసిన తల్లి

- November 15, 2019 , by Maagulf
దుబాయ్: చెత్త కుప్ప లో మృతశిశువుని పారేసిన తల్లి

దుబాయ్: ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లిన ఫిలిప్పీన్  మహిళ(35)కు స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా శారీరక సంబంధానికి దారితీసింది. దాంతో ఆమె గర్భం దాల్చింది. నెలలు నిండిన ఆమెకు మృతశిశువు జన్మించింది. మృతశిశువు జన్మించడంతో కంగారు పడిన ఆమె పసికందు మృతదేహాన్ని బయటపడేయడానికి పరిచయస్థుడైన పాకిస్థాన్ వ్యక్తి సాయం కోరింది. మహిళ నుంచి కొంత డబ్బు తీసుకున్న పాకిస్తానీ శిశువు మృతదేహాన్ని చెత్తకుండీలో పడేశాడు. అయితే, చెత్తకుండీలో పసికందు మృతదేహం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి సీసీటీవీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా పాక్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి సమాచారంతో శిశువు తల్లిని, ఆమె ప్రసవానికి సహకరించిన మరో మహిళను అరెస్ట్ చేశారు. జూన్ 18న బర్ దుబాయ్ పోలీస్ స్టేషన్‌లో ఈ ముగ్గురిపై కేసు నమోదైంది.

తాజాగా ఈ కేసు దుబాయ్ కోర్టులో విచారణకు వచ్చింది. పరాయి వ్యక్తితో ఏర్పడిన అక్రమసంబంధం కారణంగా గర్భం దాల్చిన తాను మరో మహిళ సహయంతో అల్ సత్వాలోని తన రూమ్‌లోనే మృతశిశువును ప్రసవించినట్లు నిందితురాలు తెలిపింది. పసికందు మృతదేహాన్ని తరలించేందుకు పాక్ వ్యక్తి సాయం తీసుకున్నట్లు చెప్పింది. డబ్బులు ఇస్తామని చెప్పడంతో గుడ్డల్లో చుట్టి, ఒక బ్యాగులో పెట్టి తన చేతికిచ్చిన శిశువు మృతదేహాన్ని దెయిరాలోని పెద్ద చెత్తకుండీలో పడేసినట్టు పాకిస్తానీ తెలిపాడు. ఫిలిప్పీన్స్ ఇద్దరు  మహిళలకు  వారి వీసా గడువు ముగిసిన తరువాత ఎక్కువ కాలం గడిపినట్లు అభియోగాలు మోపారు.ముగ్గురు నిందితులను విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com