ఫేస్‌బుక్‌, వాట్సాప్‌...ఓ శుభవార్త..

- November 15, 2019 , by Maagulf
ఫేస్‌బుక్‌, వాట్సాప్‌...ఓ శుభవార్త..

సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్ ఓ గుడ్ న్యూస్‌..ఇంకో షాకింగ్ న్యూస్‌ను తెలిపాయి. ఇటీవలే, వాట్సాప్‌పే అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై కొందరు నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఇతర ఫైనాన్షియల్‌ టెక్నాలజీ సంస్థలకు దీటుగా పేమెంట్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు వాట్సాప్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించేలా లేవు. యూజర్ల వివరాలను గోప్యంగా ఉంచడంలో వాట్సాప్‌ సామర్థ్యంపై నెలకొన్న సందేహాలే ఇందుకు కారణం. దేశీ చెల్లింపుల సంస్థలు, బ్యాంకులు పాటించే పారదర్శకతను.. వాట్సాప్‌ పే పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు, వాట్సాప్‌ పే లో యూజర్ల ఆర్థిక లావాదేవీల వివరాలకు భద్రత ఉండకపోవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ సైతం భావిస్తోంది. వాట్సప్‌ తన యూజర్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచలేకపోతోందనే సమాచారం...వినియోగదారులను ఇబ్బందిపెట్టేదే. డబ్బుకు సంబంధించిన అంశం కాబట్టి ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజాన్ని...అలా వాడుకునేందుకు ముందుకు పెద్దగా వినియోగదారులు ఆసక్తి చూపకపోవచ్చునని అంటున్నారు.

కాగా, ఫేస్‌బుక్ కీలక ప్రకటన చేసింది. ఆన్‌లైన్ చెల్లింపుల రంగంలోకి ఎంటరవుతున్నట్లు తెలిపింది. సరికొత్త ఆన్‌ లైన్‌ చెల్లింపుల సేవలు అందించేందుకు ఫేస్‌బుక్‌ పే ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించింది. చెల్లింపుదారులు సులువైన, సురక్షితమైన, నమ్మకమైన చెల్లింపులు జరపడానికి వీలుగా తాము ఈ సేవను ప్రారంభిస్తున్నామని ఫేస్‌బుక్‌ ప్రకటించింది. దీనిని ఉపయోగించి కొనుగోళ్లు, చెల్లింపులతో పాటు విరాళాలు, నగదు లావాదేవీలను కూడా చేసుకోవచ్చనిఆ సంస్థ తెలిపింది. దీనిని ఫేస్‌బుక్‌లో మాత్రమే కాకుండా మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌లలో కూడా వినియోగించుకోవచ్చని ప్రకటించింది.

ఇటీవలే, ఇజ్రాయిల్‌కు చెందిన ఓ స్పైవేర్‌ ప్రపంచవ్యాప్తంగా వాట్సప్‌ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్పైవేర్ వలలో 1400లో భారతీయ జర్నలిస్టులు, ఉద్యమకారులు ఉన్నారు. రిమోట్‌ పద్దతుల్లో ఫోన్లలో నిఘా సాఫ్ట్‌ వేర్‌ను హ్యాకర్లు ఇన్‌స్టాల్ చేశారు. ఈ సైబర్‌ దాడులను గుర్తించి స్పందించిన వాట్సప్‌, లోపాలను సరిచేసి సరికొత్త భద్రతా ఏర్పాట్లతో అప్‌డేట్‌ ఇచ్చింది. హ్యాకర్ల వలలో పడిన వారిని గుర్తించడంలో టొరెంటోకు చెందిన సిటిజన్‌ ల్యాబ్‌ వాట్సాప్‌కు సాయం చేసింది. జరిగిటన సైబర్‌ దాడిలో 20 దేశాలకు చెందిన జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు బాధితులుగా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com