తండ్రిని చంపిన కేసులో కువైటీకి మరణ శిక్ష

- November 15, 2019 , by Maagulf
తండ్రిని చంపిన కేసులో కువైటీకి మరణ శిక్ష

కువైట్‌: కోర్ట్‌ ఆఫ్‌ కాస్సేషన్‌ కోర్ట్‌, కుటుంబ తగాదాల కారణంగా తండ్రిని చంపిన కువైటీకి మరణ శిక్ష విధించింది. కేసు వివరాల్లోకి వెళితే ఈ ఘటన గత ఏడాది నవంబర్‌లో జరిగింది. నార్కోటిక్‌ డ్రగ్స్‌ మత్తులో నిందితుడు, తన తండ్రిని హత్య చేసి, ఆ హత్యకు ఉపయోగించిన కిచెన్‌ నైఫ్‌ని గార్బేజ్‌ బిన్‌లో విసిరేశాడు. కేసు విచారణ చేపట్టిన అధికారులు నిందితుడ్ని ఓయూన్‌ ఎడారి ప్రాంతంలో కనుగొన్నారు. అనంతరం అతన్ని విచారించగా, హత్య తానే చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com