రెక్లెస్‌ డ్రైవింగ్‌: పోలీస్‌ ఆఫీసర్‌ మృతి

- November 16, 2019 , by Maagulf
రెక్లెస్‌ డ్రైవింగ్‌: పోలీస్‌ ఆఫీసర్‌ మృతి

అబుదాబీ పోలీస్‌కి చెందిన ఓ ట్రాఫిక్‌ ఆఫీసర్‌ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అల్‌ అయిన్‌లో ఓ రెక్లెస్‌ డ్రైవర్‌ కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీస్‌ పెట్రోల్‌ వాహనంలో సర్జంట్‌ అలీ సయీద్‌ ఖర్బాష్‌ అల్‌ సాది వుండగా, ఓ వ్యక్తి అతి వేగంతో వాహనాన్ని పెట్రోల్‌ వాహనంపైకి తీసుకెళ్ళడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఆ క్షణంలో పోలీస్‌ అధికారి హల్లామి టన్నెల్‌ వద్ద ట్రాఫిక్‌ని నియంత్రిస్తున్నారు. ప్రమాదంలో అక్కడికక్కడే ఆ అధికారి ప్రాణాలు కోల్పోయారు. పోలీస్‌ అధికారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది అబుదాబీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌. మృతుడు అల్‌ సాది చాలా కమిటెడ్‌ అధికారి అని పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com