సౌదీలో ఉన్మాది వీరంగం..ముగ్గురు స్టేజీ డ్యాన్సర్లపై కత్తితో దాడి
- November 17, 2019
రియాద్ : సౌదీ అరేబియాలో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. స్టేజీపై నృత్యాలు ప్రదర్శిస్తున్న ముగ్గురు డ్యాన్సర్లపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితున్ని అదుపులోకి తీసుకున్నాయి. గాయపడ్డ డ్యాన్సర్లను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పింది. డ్యాన్సర్లపై ఉన్మాది దాడికి పాల్పడ్డ కారణం తెలియరాలేదు. కాగా, సౌదీ యువరాజు సల్మాన్ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మహిళలకు స్వేచ్ఛ కల్పించాలనే ఉద్దేశంతో విదేశీ ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. మహిళలు కూడా పురుషులతో సమానంగా కార్లు డ్రైవింగ్ చేయొచ్చని ప్రకటించారు. వినోదం కోసం మూతపడ్డ సినిమా థియేటర్లను మళ్లీ తెరిపించారు. 2030నాటికి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







