ఎమిరాతీలకు వీసా-ఆన్‌-అరైవల్‌ ప్రకటించిన ఇండియా

- November 18, 2019 , by Maagulf
ఎమిరాతీలకు వీసా-ఆన్‌-అరైవల్‌ ప్రకటించిన ఇండియా

నవంబర్‌ 16 నుంచి యూఏఈ జాతీయులకు వీసా ఆన్‌ ఎరైవల్‌ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ట్రేడ్‌ సంబంధాలు, అలాగే మానవ సంబంధాల్ని మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీసా ఆన్‌ అరైవల్‌, యూఏఈ జాతీయులకు 60 రోజులకుగాను అందించనున్నారు. బిజినెస్‌, టూరిజం, కాన్ఫరెన్స్‌ అలాగే మెడికల్‌ అవసరాల నిమిత్తం డబుల్‌ ఎంట్రీ సౌకర్యం కల్పిస్తున్నారు. ఎంపిక చేసిన ఆరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ సౌకర్యం అందుబాటులో వుంటుంది. బెంగళూరు, చెన్నయ్‌, ఢిల్లీ, హైద్రాబాద్‌, కోల్‌కతాతోపాటు ముంబై విమానాశ్రయాలు ఇందులో వున్నాయి. ఇ-వీసా లేదా రెగ్యులర్‌ / పేపర్‌ వీసా గతంలో వున్నవారికి ఈ వీసా ఆన్‌ అరైవల్‌ స్కీమ్‌ వర్తిస్తుంది. తొలిసారి యూఏఈకి వచ్చేవారు ఇ-వీసా లేదా రెగ్యులర్‌/పేపర్‌ వీసాకి అప్లయ్‌ చేసుకోవాల్సి వుంటుంది. పాకిస్తానీ మూలాలున్న యూఏఈ జాతీయులకు వీసా-ఆన్‌-అరైవల్‌ సౌకర్యం లభించదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com