2020లో అందుబాటులోకి లో కాస్ట్ ఎయిర్‌లైన్ 'ఎయిర్ అరేబియా అబుదాబీ'
- November 18, 2019
యూఏఈ తొలి లో కాస్ట్ ఎయిర్ లైన్ 'ఎయిర్ అరేబియా అబుదాబీ', క్యాపిటల్ నుంచి తన ఆపరేషన్స్‌ని వచ్చే ఏడాది తొలి హాఫ్‌లో ప్రారంభించనున్నట్లు ఎతిహాద్ ఏవియేషన్ గ్రూప్ సీఈఓ టోనీ డగ్లస్ చెప్పారు. దుబాయ్ ఎయిర్ షో సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. క్వార్టర్ 1, క్వార్టర్ 2లో ఈ ప్రాజెక్టకి సంబంధించి కీలక ప్రకటనలు రాబోతున్నాయని చెప్పారు. కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కాబోతున్నాయి. గత అక్టోబర్‌లో సార్జాకి చెంఇన లో కాస్ట్ క్యారియర్ ఎయిర్ అరేబియా, ఎతిహాద్ ఏవియేషన్ గ్రూప్, ఎయిర్ అరేబియా అబుదాబీని ప్రకటించడం జరిగింది. ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా (షార్జా) తర్వాత లో కాస్ట్ ఎయిర్‌లైన్‌గా ఈ కొత్త సంస్థ సేవలు అందించనుంది. యూఏఈ నుంచి ఆపరేట్ కానున్న ఐదో ఎయిర్‌లైన్‌గా ఈ కొత్త ఎయిర్‌లైన్ పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకోనుంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







