'జ్యుయెలరీ అరేబియా' ప్రారంభం

'జ్యుయెలరీ అరేబియా' ప్రారంభం

బహ్రెయిన్‌: ప్రైమ్‌ మినిస్టర్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా, జ్యుయెల్‌ అరేబియా 2019 ఈవెంట్‌ని ప్రారంభించారు. బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ అండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేశారు. 561 మందికి పైగా ఎగ్జిబిటర్స్‌ 36 దేశాల నుంచి ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు. మిడిల్‌ ఈస్ట్‌లో ఖరీదైన జ్యుయెలరీ, లగ్జరీ వాచ్‌లలకు ఈ ఎగ్జిబిషన్‌ అత్యంత అరుదైన, అద్భుతమైన వేదిక. ఐదు రోజులపాటు ఈ ఎగ్జిబిషన్‌ జరుగుతుంది. శనివారం వరకు కొనసాగే ఈ ఎగ్జిబిషన్‌లో లగ్జరియస్‌ జ్యుయెలరీ, హై ఎండ్‌ వాచ్‌లు ప్రదర్శన మరియు అమ్మకానికి వుంచుతారు. అలాగే విలువైన స్టోన్స్‌, జెమ్స్‌ మరియు లగ్జరీ యాక్సెసరీస్‌ కూడా లభ్యమవుతాయి.

 

Back to Top