ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన వ్యక్తి అరెస్ట్‌

ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన వ్యక్తి అరెస్ట్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు పేర్కొంది. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన ఓ వీడియో ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. పలువురి వ్యక్తులపై నిందితుడు దాడి చేసినట్లు వీడియోలో స్పష్టంగా కన్పిస్తోంది. ఈ మేరకు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. కేసు విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు.

 

Back to Top