షేక్‌ ఖలీఫా సోదరుడి మృతి

షేక్‌ ఖలీఫా సోదరుడి మృతి

ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, తన సోదరుడు షేక్‌ సుల్తాన్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు. ప్రెసిడెంట్‌ రిప్రెజెంటేటివ్‌ అయిన షేక్‌ సుల్తాన్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, సోమవారం తుది శ్వాస విడిచారు. మినిస్ట్రీ ఆఫ్‌ ప్రెసిడెన్షియల్‌ ఎఫైర్స్‌ ఆదేశాల నేథ్యంలో యూఏఈలో మూడు రోజులపాటు సంతాప దినాలు అమల్లో వుంటాయి. వైస్‌ రపెసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ మక్తౌమ్‌ కూడా షేక్‌ సుల్తాన్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి షేక్‌ సుల్తాన్‌ అందించిన సేవల్ని ఈ సందర్భంగా యూఏఈ పాలకులు, ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.

 

Back to Top