దుబాయ్: ప్రముఖ సోషల్ వర్కర్ 'ఉమా పద్మనాభన్' కు ఆత్మీయ సన్మానం
- November 20, 2019
దుబాయ్: యూఏఈ.. అదో అందమైన దేశం.. ఎంత అందమైనదో అంత కఠినం కూడా! ఎన్నో ఆంక్షలు విధించే ప్రభుత్వం. మరి ఇలాంటి పరిస్థితుల్లో పొట్ట చేతపట్టుకొని నకిలీ ఏజెంట్ల బారిన పడి ఇక్కడికి వచ్చాక ఎన్నో సమస్యనలు ఎదుర్కొని ఒక్కోసారి కటకటాల బారిన పడిన తమ్ముళ్ల సంఖ్య కోకొల్లలు. అలాంటి వారికి నేనున్నాను అని సాయం అందించే ప్రముఖ సోషల్ వర్కర్ శ్రీమతి ఉమా పద్మనాభన్ (ఉమా ప్యాడీ)..40 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించి ఎందరినో ఆదుకున్న ఉమా, దుబాయ్ విడిచి భారతదేశం తిరిగి వెళ్ళిపోతున్న సందర్భంగా దుబాయ్ లోని 'వేవ్ సంస్థ' మరియు స్నేహితులు, అభిమానులు కలిసి ఉమా పద్మనాభన్ ను సత్కరించి ఆమెకు ఘన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా 'వేవ్ సంస్థ' ఫౌండర్ గీతా రమేష్ మాట్లాడుతూ ఆర్తులకు ఉమా అందించిన సేవలు గొప్పవి అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు ప్రముఖులు ఉమా తో తమకున్న అనుబంధాన్ని 'మాగల్ఫ్.కామ్' తో పంచుకున్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..