20 రోజుల వ్యవధిలో ఖతర్ లో... ముగ్గురు విదేశీ కార్మికుల ఆత్మహత్య
- January 13, 2016
భారతదేశానికీ, నేపాల్ దేశానికి సంబంధించిన ముగ్గురు విదేశీయులు 20 రోజుల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు ' గల్ఫ్ టైమ్స్ ' పేర్కొంది. ఇందులో ఇరువురు భారతీయులు ఉన్నట్లుఆ పత్రిక తెలిపింది. ఇందులో ఒకరు మల్ల లలితమ్మ ( 45 ) కోస్తాంధ్రా విశాకపట్నం జిల్లాలోని పల్లంకుర్రు ప్రాంతానికి చెందిన ఈమె గల్ఫ్ కు కొంతకాలం క్రితం పని మనిషిగా వెళ్ళినట్లు తెలుస్తోంది. గత డిసెంబర్ 24వ తేదీన ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా ఆమె మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ఆమెను ఉద్యోగంలోనికి తీసుకొన్నవారు ఆమె మృతదేహం కోసం వెతుకుతున్నారు.
అలాగే, ఆత్మహత్యకు పాల్పడిన మరొక యువకుడు ఈ ఏడాది జనవరి 6 వ తేదీన ఉరి వేసుకొన్నాడు. ప్రదీప్ గణపతి ( 22 ), దక్షిణ తమిళనాడు లోని మేదవిల్లం ప్రాంతానికి చెందిన వ్యక్తి. కాగా ఇతని మృతదేహాన్ని భారతదేశానికి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







