20 రోజుల వ్యవధిలో ఖతర్ లో... ముగ్గురు విదేశీ కార్మికుల ఆత్మహత్య

- January 13, 2016 , by Maagulf
20 రోజుల వ్యవధిలో ఖతర్ లో...  ముగ్గురు విదేశీ కార్మికుల ఆత్మహత్య

 భారతదేశానికీ, నేపాల్ దేశానికి సంబంధించిన ముగ్గురు విదేశీయులు  20 రోజుల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు ' గల్ఫ్ టైమ్స్ ' పేర్కొంది. ఇందులో ఇరువురు భారతీయులు ఉన్నట్లుఆ పత్రిక తెలిపింది. ఇందులో ఒకరు  మల్ల లలితమ్మ ( 45 )  కోస్తాంధ్రా విశాకపట్నం జిల్లాలోని పల్లంకుర్రు ప్రాంతానికి చెందిన ఈమె గల్ఫ్ కు కొంతకాలం క్రితం పని మనిషిగా వెళ్ళినట్లు తెలుస్తోంది. గత డిసెంబర్ 24వ తేదీన ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా ఆమె మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ఆమెను ఉద్యోగంలోనికి తీసుకొన్నవారు  ఆమె మృతదేహం కోసం వెతుకుతున్నారు.
అలాగే, ఆత్మహత్యకు పాల్పడిన మరొక యువకుడు ఈ ఏడాది జనవరి 6 వ తేదీన ఉరి వేసుకొన్నాడు.  ప్రదీప్ గణపతి ( 22 ), దక్షిణ తమిళనాడు లోని మేదవిల్లం ప్రాంతానికి చెందిన వ్యక్తి. కాగా ఇతని మృతదేహాన్ని భారతదేశానికి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com