విజిటర్ ని ఆశ్చర్యపరిచిన దుబాయ్ పోలీస్
- November 26, 2019
దుబాయ్: ఫ్రాన్స్‌కు చెందిన పర్యాటకుడికి దుబాయ్ పోలీసులు సర్ప్రైజ్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. ఫ్రాన్స్ నుంచి ఓ పర్యాటకుడు ఇటీవల దుబాయ్ పర్యటనకు వచ్చాడు. పర్యటన అనంతరం దుబాయ్ ఎయిర్‌పోర్టుకు క్యాబ్‌లో వెళ్తూ ఆ వ్యక్తి తన ఫోన్‌ను క్యాబ్‌లోనే మరిచిపోయాడు. ఫ్రాన్స్ వెళ్లిన అనంతరం.. దుబాయ్ పోలీసులకు తన ఫోన్ పోయినట్టు ఈ-మెయిల్ చేశాడు. ప్రయాణించిన క్యాబ్‌కు సంబంధించిన, తదితర వివరాలు పంపడంతో.. అతి తక్కువ సమయంలోనే దుబాయ్ పోలీసులు పర్యాటకుడి ఫోన్‌ను కనుగొన్నారు. ఫోన్ దొరికిన వెంటనే దుబాయ్ పోలీసులు.. దుబాయ్ నుంచి ఫ్రాన్స్‌లోని పర్యాటకుడి అడ్రస్‌కు ఆ ఫోన్‌ను షిప్మెంట్ చేసేశారు. పోయిన తన ఫోన్ నేరుగా ఇంటికి రావడం చూసి.. పర్యాటకుడు ఆశ్చర్యపోయాడు. ఒక ఫోన్ కోసం దుబాయ్ పోలీసులు ఇంతలా చేయడం తాను మర్చిపోలేనని ఆనందం వ్యక్తం చేశాడు. ఫోన్‌ను వెతికి పెట్టి, ఫ్రాన్స్‌కు పంపినందుకు దుబాయ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.కోల్పోయిన వస్తువులను వీలైనంత త్వరగా మరియు వారు ఎక్కడ ఉన్నా తిరిగి ఇవ్వడానికి దుబాయ్ పోలీసులు ఎటువంటి ఆలస్యం చేయరు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







