దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా...

- November 26, 2019 , by Maagulf
దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా...

ముంబై:మహా రాజకీయాలు మలుపులు తిరుగుతూ ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయి. ఈరోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తరువాత మహారాష్ట్రలో రాజకీయాలు చకచకా మారిపోయాయి. మధ్యాహ్నం సమయంలో అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, మధ్యాహ్నం 3: 30 గంటల సమయంలో ఫడ్నవీస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ పెట్టిన తరువాత శివసేనను దుమ్మెత్తి పోశారు.


శివసేన నమ్మించి మోసం చేసిందని చెప్పారు. శివసేన పార్టీ బలం లేదని చెప్పిన తరువాత తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం అయ్యామని, కానీ, ఆ తరువాత శివసేన పార్టీ బీజేపీ నేతలను బెదిరించి, ఆ తరువాత ఎన్సీపీతో కలిసి మహా అఘాడిని ఏర్పాటు చేసిందని అన్నారు. అజిత్ పవార్ రాజీనామా చేసిన తరువాత తానూ కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.


మరికాసేపట్లో గవర్నర్ ను కలిసి ఫడ్నవీస్ రాజీనామాను సమర్పించబోతున్నారు. అయితే, ఇప్పుడే అసలు రాజకీయం మొదలు కాబోతున్నది. అజిత్ పవార్ తిరిగి ఎన్సీపీలోకి వస్తే.. తిరిగి ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారా లేదా అన్నది చూడాలి. శివసేనతో తెగతెంపులు చేసుకున్నాక, ఎన్సీపీ తమకు అండగా ఉంటుందని అనుకున్నామని, కానీ, ఎన్సీపీ తమకు హ్యాండ్ ఇచ్చిందని అన్నారు.


ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా కొనసాగలేని పరిస్థితి ఉన్నది కాబట్టి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రపతి పాలన వద్దు అని చెప్పి అజిత్ పవర్ తమతో చేతులు కలిపారని అన్నారు. ప్రజల సమస్యలను తీర్చేందుకే తామంతా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని అనుకున్నామని, కానీ, ఇలా జరుగుతుందని ఊహించలేదని చెప్పారు. అయితే, ఇప్పుడు అసలు కథ మోడలింది. శివసేన పార్టీకి చెందిన అభ్యర్థి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పడంతో ఎన్సీపీ, కాంగ్రెస్ లు సమ్మతిస్తాయా చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com