700 ఖైదీలను విడిపించేందుకు Dh1m సహాయం అందించిన భారత వ్యాపారవేత్త

- November 26, 2019 , by Maagulf
700 ఖైదీలను విడిపించేందుకు Dh1m సహాయం అందించిన భారత వ్యాపారవేత్త

యూఏఈ లో 700 మంది ఖైదీల అప్పుల్ని తీర్చడానికి మరియు వారి ఇంటికి వెళ్ళడానికి ఒక భారతీయ ఆభరణాల వ్యాపారవేత్త 1 మిలియన్ దిర్హాములు చెల్లించారు. వివరాల్లోకి వెళ్తే..

 'ప్యూర్ గోల్డ్' గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ ఫిరోజ్ మర్చంట్ స్వీయ-నిర్మిత లక్షాధికారి, 1989 నుండి యూఏఈ లో నివసిస్తూ ప్రముఖ ప్రవాస భారతీయుల్లో ఒకరిగా మంచి గుర్తింపు సంపాదించారు. ఈయనకు యూఏఈ ప్రభుత్వం పెర్మనంట్ రెసిడెన్సీ,  మరియు యూఏఈ కి ఆయన అందించిన సహకారానికి గోల్డెన్ కార్డ్‌తో గౌరవించింది.

'ప్యూర్ గోల్డ్' గ్రూప్ వ్యవస్థాపకుడు 2008 లో Dh1m విలువతో "ఫర్గాటెన్ సొసైటీ" అని పిలిచే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఎందరో శరణార్ధులకు సహాయాన్ని అందించారు. 

'ప్యూర్ గోల్డ్' గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ ఫిరోజ్ మర్చంట్ మాట్లాడుతూ, "ఎందరో ఖైదీలు తమ శిక్షాకాలం పూర్తయినా కూడా స్వదేశానికి వెళ్లలేకపోయారు..కారణం వారికి జరిమానా కట్టే స్థోమత లేకపావటమే..అందుకే అప్పుల్లో ఉన్న ఖైదీలకు రెండవ అవకాశం ఇవ్వడం, వారిని విడిపించడానికి మరియు వారి స్వదేశాలకు తిరిగి పంపటానికి ఈ "ఫర్గాటెన్ సొసైటీ" కృషి చేస్తుంది. యూఏఈ యొక్క 48 వ జాతీయ దినోత్సవం మరియు Year of Tolerance ను ప్రతిబింబిస్తూ ఈ ఏడాది 700 మంది ఖైదీల అప్పుల్ని తీర్చాము" " అని తెలిపారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి సమాజం ముందుకు రావాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా, విడుదలవుతున్న ఖైదీలు ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇండియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, రష్యా మరియు థాయిలాండ్ సహా 30 కి పైగా దేశాలకు చెందినవారు. సుమారు 150 మంది ఖైదీలు అజ్మాన్ జైలు నుండి, 160 మంది ఫుజైరాకు చెందినవారు. మిగిలిన ఖైదీలను దుబాయ్, అబుదాబి, షార్జా, రాస్ అల్ ఖైమా, ఉమ్ అల్ క్వాయిన్ జైళ్ల నుంచి విడుదల చేస్తారు.

మిస్టర్ మర్చంట్ ఇచ్చిన డబ్బు సామాజిక బాధ్యత యొక్క బలమైన భావాన్ని ప్రదర్శిస్తుందని అజ్మాన్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నుయిమి అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com