బంగ్లా కేఫ్ నరమేధం కేసులో... దోషులకు ఉరిశిక్ష
- November 28, 2019
ఢాకా:బంగ్లాదేశ్‌లో 2016లో ఓ కేఫ్‌లో చొరబడిన మిలిటెంట్లు నరమేధం సృష్టించారు. ఈ కేసులో దోషులుగా తేలిన జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) మిలిటెంట్ గ్రూపుకు చెందిన ఏడుగురు సభ్యులకు ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఉరిశిక్ష విధించింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో జేఎంబీ సభ్యుడిని నిర్దోషిగా తేల్చింది. ' మారణహౌమం సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఇలాంటి వారికి ఉరే సరైన శిక్ష' అని తీర్పు వెలువరించే సమయంలో జస్టిస్ ముజీబుర్ రహ్మాన్ వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుపై బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో యాంటీ టెర్రరిస్ట్ ట్రిబ్యునల్ ఎదురుగా భారీగా బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రాపిడ్ యాక్షన్ బెటాలియన్, భద్రతా బలగాలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జేఎంబీ సానుభూతిపరులు కోర్టు ఆవరణకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు తీర్పును విమర్శించారు. ప్రత్యేక న్యాయస్థానం తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్టు దోషుల కుటుంబ సభ్యులు మీడియాతో చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గులామ్ షరూర్ ఖాన్ జాకిర్ వెల్లడించిన వివరాల ప్రకారం...2016, జులై1న ఢాకాలోని గుల్షన్ ప్రాంతంలోని హౌలీ ఆర్టీసన్ కేఫ్‌పై జేఎంబీ మిలిటెంట్ గ్రూపు సభ్యులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 22మంది మృతి చెందారు. వీరిలో 17 మంది విదేశీయులు ఉన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







