దుబాయ్:ఘోర రోడ్డుప్రమాదం లో భారతీయ వైద్యుడు మృతి
- November 28, 2019
దుబాయ్: దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డుప్రమాదంలో భారత్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు జాన్ మార్షల్ స్కిన్నర్(60) మృతి చెందారు. జుమేరా విలేజ్ సర్కిల్‌లోని తన ఇంటి నుంచి తాను పనిచేసే అల్ ముసల్లా మెడికల్ సెంటర్‌కు బయల్దేరిన స్కిన్నర్... వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపంలో అతడు ప్రయాణిస్తున్న నిస్సాన్ కారు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్కిన్నర్ అక్కడికక్కడే చనిపోయారు. ఇక ఉదయం విధులకు వెళ్లిన భర్త రాత్రి అయిన తిరిగి ఇంటికి రాకపోవడతో భార్య సిసీ మార్షల్.. అల్ ముసల్లా మెడికల్ సెంటర్‌కు ఫోన్ చేసింది.
దీంతో ఆసుపత్రికి చెందిన అధికారులు బుధవారం ఉదయం అల్ రాఫా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొంతసేపటి తరువాత పోలీసుల నుంచి స్కిన్నర్ కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. ప్రమాదంలో చనిపోయిన స్కిన్నర్ మృతదేహం కుసైస్ మార్చురీలో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. దీంతో వెంటనే భార్య, తోటి ఉద్యోగులు, స్నేహితులు ఆసుపత్రికి వెళ్లి స్కిన్నర్ మృతదేహాన్ని గుర్తించారు.
కేరళ రాష్ట్రం తిరువనంతపురంకు చెందిన డాక్టర్ జాన్ మార్షల్ స్కిన్నర్ 20 ఏళ్లుగా యూఏఈలోనే వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన యూఏఈలో ప్రముఖ వైద్యులలో ఒకరు. ప్రిమాకేర్ క్లినిక్స్‌లో 16 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. స్కిన్నర్ డయాబెటిస్ నిపుణులని తోటి వైద్యుడు శశికుమార్ కల్లివలప్పిల్ పేర్కొన్నారు. అతని మృతి తమను షాక్‌కు గురి చేసిందన్నారు సహోద్యోగులు. స్కిన్నర్ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలిద్దరూ బహ్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్నారు. డాక్టర్ స్కిన్నర్ ఆరోగ్య నిపుణుల కుటుంబం నుండి వచ్చారు. అతని తల్లిదండ్రులు, సోదరులు, సోదరీమణులు అందరూ ఆయా రంగాలలో ప్రసిద్ధ వైద్యులు.
స్కిన్నర్ మృతితో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. విధులకు వెళ్లిన భర్త తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో భార్య గుండెలవిసేలా విలిపిస్తోంది. అక్కడి ఫార్మాలిటీలను పూర్తి చేసి స్కిన్నర్ అంత్యక్రియలను జెబెల్ అలీ శ్మశానవాటికలో నిర్వహించునున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!