వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్

- November 30, 2019 , by Maagulf
వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే మరో అద్భుతమైన ఫీచర్‌ను తన యూజర్లకు అందుబాటులోకి తేనుంది. ఇకపై వాట్సాప్‌లో యూజర్లు గ్రూప్ చాట్‌లలో పంపే మెసేజ్‌లు వాటంతట అవే నిర్దిష్టమైన కాల వ్యవధి అనంతరం అదృశ్యమయ్యేలా ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. డిసప్పియరింగ్ మెసేజెస్ పేరిట ఈ ఫీచర్ లభ్యం కానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్‌ను ఆండ్రాయిడ్‌లో వాడుతున్న యూజర్లకు అందుబాటులో ఉండగా, త్వరలో ఐఓఎస్ యూజర్లకు, ఆ తరువాత పూర్తి స్థాయిలో అందరు యూజర్లకు ఈ ఫీచర్ లభ్యం కానుంది. ఇక సదరు మెసేజ్‌లు ఎంత సేపటి తరువాత అదృశ్యం కావాలో యూజర్లు టైమ్ లిమిట్ సెట్ చేసుకునే విధంగా ఆప్షన్లను అందివ్వనున్నారు. ఈ క్రమంలో 1 గంట, 1 రోజు, 1 నెల, 1 ఏడాదిలలో ఎంత కాల వ్యవధినైనా యూజర్లు సెట్ చేసుకుంటే ఆ సమయం వరకు వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో యూజర్లు పంపిన మెసేజ్‌లు ఉంటాయి. ఆ టైమ్ అయిపోగానే ఆ మెసేజ్‌లు వాటంతట అవే ఆటోమేటిగ్గా డిలీట్ అవుతాయి. ఇక త్వరలోనే వాట్సాప్‌లో డార్క్ మోడ్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తేనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com