సౌదీ-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు..
- November 30, 2019
యూఏఈలో తన రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం దుబాయ్ చేరుకున్న సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ను యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ రషీద్ మక్తూమ్ జబీల్ ప్యాలెస్ లో సాదరంగా స్వాగతించారు.
అనంతరం జరిగిన భేటీలో సౌదీ రాజు, ఆయన ప్రతినిధులు బ్రృందంతో షేక్ మొహమ్మద్ ఇతర అధికారుల బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో పరస్పర సహకారం అందిపుచ్చుకోవటంపై చర్చించారు.
అంతకుముందు యూఏఈ రాజధాని అబుదాబిలో మంగళవారం పర్యటించిన సౌదీ రాజును అబుదాబి క్రొన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ బలగాల డిప్యూటీ కమాండర్ నుంచి సాదర స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా ఇరు నేతల మధ్య నాలుగు కీలక అంశాలపై ఒప్పందం కుదిరింది. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో జరిగిన సౌదీ-ఎమిరాటి సమన్వయ మండలి సమావేశంలో ఈ మేరకు పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అలాగే ఇరు దేశాలకు ఉపయుక్తంగా ఉండే 7 వ్యూహాత్మక అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







