వినోదం పంచేందుకు దిరియా ఒయాసిస్ రెడీ..
- December 01, 2019
వినోదానికి, అహ్లాదానికి సౌదీ అరేబియాలో మరో అద్భుత ప్రంపంచం సిద్ధమైంది. ఈ శుక్రవారం నుంచి దిరియా ఒయాసిస్ సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. ప్రస్తుతం దిరియా రిక్రియేషన్ ఏరియా రూపుదిద్దుకున్న ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశంలో ఏర్పాటైంది. రాజ వైభవం చాటేలా రాజులు, వీరుల పుట్టినిల్లుగా చెప్పుకునే సౌదీ అరేబియా తొలి రాజధాని కూడా ఇదే కావటం విశేషం.
సందర్శకులకు అవధుల్లేని వినోదం అందించే దిరియా ఒయాసిస్‌ను లక్ష 30 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో భారీగా నిర్మించారు. ఇందులో నేచర్, ఇమేజినేషన్, రిఫ్లెక్షన్, ఎక్జైట్‌మెంట్ అనే నాలుగు జోన్లు సందర్శకులకు అహ్లాదాన్ని అందించనున్నాయి.
నేచర్ జోన్ :
నేచర్ జోన్ ను ప్రకృతి రమణీయతతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. అడవులను తలపించేలా వనాలు, సీతాకాకోచిలుకలు, రైతు సంబంధిత మార్కెట్లు ఈ జోన్‌లో కనిపిస్తాయి. అలాగే ఈ జోన్‌లో ప్రకృతిని అస్వాదిస్తూ సాగే ఏరియల్ జిప్ జాగ్ రైడ్ సందర్శకులను విశేషంగా ఆకర్షించనుంది.
అట్రాక్షన్స్ :
జీవితంలో కాస్తంత థ్రిల్ కోరుకునే వారికి కూడా దిరియా ఒయాసిస్ వెల్ కం చెబుతోంది. స్టార్ ఫ్లైయర్ రైడ్‌తో థ్రిల్ ఫీలింగ్ అందించనుంది. ఇక స్టీమ్ ల్యాబ్ ఇంటరాక్టీవ్ ఎగ్జిబిషన్‌లో ఉన్న వివిధ రకాల ఆటలతో పిల్లలు ఎంజాయ్ చేయవచ్చు. లేనిది ఉన్నట్లుగా ఊహాలోకంలోకి తీసుకెళ్లే ఇల్యూషన్ రూమ్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ షాప్స్ చిన్న పిల్లలను ఆకర్షించేవిగా ఉన్నాయి.
రిఫ్లేక్షన్ జోన్
బిజీ జీవితంలో అలసిపోయిన వారికి రిఫ్లేక్షన్ జోన్ సేద తీర్చేలా డిజైన్ చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన నీటి కొలనుల దగ్గర కూర్చొని రిలాక్స్ అవ్వొచ్చు. అలాగే అక్వా కార్ట్స్ లాంటి వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి.
ఎక్జైట్ మెంట్ జోన్
సందర్శకుల్లో ఉత్సాహం నింపేలా ఎక్జైట్ మెంట్ జోన్ రూపొందించారు. ఇందులో నాలుగు ఎస్కేప్ రూమ్స్, లేజర్ ట్యాగ్ ఏరియాతో పాటు నిజంగా గ్రౌండ్ లోనే అడుతున్నామా అనిపించేలా వర్చువల్ రియాల్టీ స్పోర్ట్స్ వరల్ట్ ఉన్నాయి. దీనికితోడు బంపర్ కార్స్ తో సందర్శకులు కావాల్సినంత ఆటవిడుపు ఉంటుంది. ఇదిలాఉంటే ఈ నాలుగు జోన్లలోనూ కార్నివాల్ గేమ్స్, స్టాల్స్, ఫుడ్ సెక్షన్స్ ఉన్నాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







