అబుధాబి:నేటి నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధన
- December 01, 2019
అబుధాబి:అత్యవసర వాహనాలకు మార్గం సుగమం చేస్తూ అబుదాబిలో కొత్తగా ట్రాఫిక్ నిబంధన అమల్లోకి వచ్చాయి.అబుధాబిలోని కింగ్ అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్ మార్గంలోని రైట్ లేన్‌లో డిసెంబర్ 1 నుండి వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.
ఎమర్జెన్సీ వాహనాలు, ప్రజా రవాణా బస్సులు, ట్యాక్సీలను మాత్రమే ఈ మార్గంలో అనుమతిస్తారు. ఈ విషయాన్ని అబుదాబి పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘిస్తే 400 దిర్హమ్ వరకు జరిమాన విధించనున్నట్లు వెల్లడించింది.
అత్యవసర వాహనాలకు మార్గం కల్పించేలా యుఎఇ అధికారులు ఇప్పటికే ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అత్యవసర వాహనాలకు దారి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసే లక్ష్యం తో గత అక్టోబర్‌లో గీవ్ వే, గీవ్ హోప్(దారి ఇవ్వు, నమ్మకం ఇవ్వు) అనే నినాదంతో ప్రచారం చేపట్టింది.
ప్రచారంలో భాగంగా ఎమర్జెన్సీ వాహనాలకు ఎలా దారీ ఇవ్వాలో పలు సూచనలు చేశారు అధికారులు. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ పడినా అత్యవసర వాహనాలకు దారి ఇచ్చేందుకు తమ వాహనాలను నిలిపివేయాల్సి ఉంటుందని వీడియోలో వివరించారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!