జనవరి 31 న విడుదల కానున్న 'నిశ్శబ్దం'
- December 02, 2019
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రధారిగా 'నిశ్శబ్దం' సినిమా రూపొందింది. థ్రిల్లర్ నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాలో అనుష్క చిత్రకారిణిగా కనిపించనుంది. దాదాపుగా విదేశాల్లో చిత్రీకరించబడిన ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు.
జనవరి 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అనుష్క భర్త పాత్రలో మాధవన్ నటించగా, అంజలి .. షాలినీ పాండే ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ కీలకమైన పాత్రను పోషించాడు. 'భాగమతి' తరువాత అనుష్క నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు వున్నాయి. అనుష్క అభిమానులంతా ఈ సినిమా కోసమే ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







