అమెరికా లో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం
- December 02, 2019
డిసెంబర్ 1న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరిని విజయవాడకు చెందిన వైభవ్ గోపిశెట్టిగా గుర్తించారు. టేనస్సీ స్టేట్ యూనివర్సిటీలో వైభవ్ ఫుడ్ సైన్స్ లో పీహెచ్ డీ చేస్తున్నారు. అక్కడే ఎంఎస్ చేస్తున్న జుడీ స్టాన్లీ పిని రియోతో కలిసి రాత్రి ఓ పార్టీకి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొట్టింది.ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ కు డ్రైవర్, డేవిడ్ స్టోరేజ్ వాహనం అక్కడే వదిలి పరారైనట్టు పోలీసులు పేర్కొన్నారు.
తమ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందడం పట్ల టీఎస్ యూ సంతాపం ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ ఘటన దురదృష్టకరమని అట్లాంటాలోని భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది అని అధికారులు తెలియజేశారు. భారత ఎంబస్సి వారిని సంప్రదించి ఆ ఇద్దరి మృతదేహాలను వారి ఇంటికి చేరేలా చెయ్యాలని బంధువులు ప్రభుత్వాన్ని కోరారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







