LIC పాలసీదారులకు శుభవార్త
- December 03, 2019
భుత్వ రంగ బీమా సంస్థ ఎల్.ఐ.సి. ఈ సంస్థ తన పాలసీదారులకు ఓ శుభవార్త చెప్పింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. క్రెడిట్ కార్డు ద్వారా జరిపే ప్రీమియం చెల్లింపులపై విధించనున్న చార్జీలను డిసెంబరు ఒకటో తేదీ నుంచి పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.
దీంతో క్రెడిట్ కార్డు ద్వారా రెన్యూవల్ ప్రీమియం, నూతన ప్రీమియం లేదా రుణాల చెల్లింపులు, పాలసీలపై తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లింపులపై అదనపు రుసుంను వసూలు చేయరు. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక క్రెడిట్ కార్డు ద్వారా ఆర్థిక లావాదేవీలను ఉచితంగా జరుపుకోవచ్చును.
అంతేకాకుండా, కార్డు రహిత చెల్లింపులు, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ల వద్ద కార్డు డిప్/స్వైప్ ద్వారా జరిపే లావాదేవీలపై ఎలాంటి అదనపు భారం పడదని ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే వినియోగదారుడు మైఎల్‌ఐసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రీమియం చెల్లింపులు జరుపుకోవచ్చునని ఎల్.ఐ.సి ఓ ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







